Keerthy Suresh : తమిళ సినీ రంగానికి చెందిన దర్శకుడు లింగుసామి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో విశాల్ కు సంబంధించి తన తండ్రి కీర్తి సురేష్ ను కోడలిగా చేసుకోవాలని కోరుకున్నాడని, కానీ తన ప్రతిపాదన చేసింది వాస్తవమేనని పేర్కొన్నాడు నిర్మాత, డైరెక్టర్.
Keerthy Suresh Rejects
ఆనంధం, రన్, సందకోళి, పైయా, మరియు వెట్టై వంటి విజయాలకు పేరుగాంచిన ప్రఖ్యాత చిత్ర నిర్మాత ఎన్ లింగుసామి నటి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం విశేషం. ఇదిలా ఉండగా నటుడు విశాల్, కీర్తి సురేష్(Keerthy Suresh) కలిసి 2018లో సందకోళి2లో నటించారు.
ఇటీవల లింగుసామి చిట్ చాట్ సందర్బంగా సంచలన విషయాలు పంచుకున్నారు. చిత్ర, నిర్మాత, విశాల్ తండ్రి జీకే రెడ్డి విశాల్ కోసం కీర్తి సురేష్ ను అనుకున్నాడని కానీ తను ఒప్పుకోలేదని తెలిపాడు.
ఈ విషయం గురించి తాను నటితో వ్యక్తం చేశానని, అయితే అందుకు సున్నితంగా తిరస్కరించిందని చెప్పాడు.
కీర్తి సురేష్ తాను 15 ఏళ్లుగా ఆంటోని తట్టిల్ తో డేటింగ్ చేస్తూ వచ్చానని, అందుకే తనను తప్ప వేరొకరిని తన భాగస్వామిగా ఊహించు కోలేక పోతున్నానని చెప్పిందన్నాడు. తాజాగా లింగు సామి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తట్టిల్, కీర్తి సురేష్ ఇటీవలే ఒక్కటయ్యారు. పెళ్లి కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సమ్మర్ వెకేషన్ గోవాలో గడుపుతున్నారు.
Also Read : Hero Prabhas Salaar 1:ప్రభాస్ సలార్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్