ఎస్తర్ నోరాన్హా ఆ మధ్యన రెచ్చి పోయి నటించింది ఓ సినిమాలో. తాజాగా లేతాకులు మూవీలో నటించేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం పూర్తిగా లేరీ ఓరియంటెడ్ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. తాజాగా హైదరాబాద్ లోని రామానాయుడు సినీ స్టూడియోలో చిత్రానికి క్లాప్ కొట్టారు.
ఫ్రెష్ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకటేష్ చిక్కాల లేతాకులు మూవీని నిర్మిస్తున్నారు. చంటి జ్ఞానముణి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్తర్ తో పాటు శృతి శరణ్ , అవయుక్త, వంశీ పాండ్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ క్లాప్ కొట్టడం విశేషం.
లేతాకులు గతంలో రాని భిన్నమైన కాన్సెప్ట్ తో ముందుకు వస్తుందని అన్నారు చిత్ర సమర్పకులు ఎంఆర్ చౌదరి. అన్ని వర్గాల మహిళలను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దసరా తర్వాత షూటింగ్ మొదలవుతుందని, ఉత్తర ప్రదేశ్ లో ప్రత్యేక సన్నివేశాలు షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు .
ఇదిలా ఉండగా దర్శకుడు చంటి జ్ఞానముణి మాట్లాడుతూ గతంలో తాను తీసిన నూతిలో కప్పలు చిత్రం కంటే ఈ లేతాకులు చిత్రం సూపర్ గా ఉంటుందన్నారు. ఇక కథ నచ్చడంతో తాను నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు ఎస్తర్ నోరాన్హా.