గతంలో ఎన్నడూ లేనంతగా సినీ రంగంలో పోటీ పెరిగి పోయింది. రిలీజైన తొలి వారం రోజుల్లోనే సినిమా హిట్టా లేక ఫట్టా అని తేలి పోతోంది. కథ నచ్చితే జనం ఓకే చెబుతున్నారు. లేదంటే అవతల మెగాస్టార్ , సూపర్ స్టార్ లు నటించినా డోంట్ కేర్ అంటున్నారు. దీంతో తాము పేరుకే స్టార్లమని నిజమైన స్టార్లు మీరేనంటూ ప్రేక్షక దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నారు.
ఎవరైనా 70 ఏళ్లు దాటితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. పోనీ 60 ఏళ్లు వచ్చినా మాకెందుకు ఈ నటన అంటూ వాపోతుంటారు. కానీ రజనీకాంత్, బాలకృష్ణ , చిరంజీవి వయసు మీద పడినా ఇంకా ముందుకు దూసుకు పోతున్నారు. ఇది పక్కన పెడితే ఈ అక్టోబర్ నెలలో భారీ సినిమాలు పోటా పోటీగా విడుదలయ్యాయి. వాటిలో తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియా, ఓవర్సీస్ తో కలిపి రూ. 400 కోట్లకు చేరుకున్నట్లు టాక్.
ఇక అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి రూ. 100 కోట్ల మార్క్ కు దగ్గరగా ఉన్నట్టు సినీ వర్గాల భోగట్టా. ఇక ఇదే మూవీస్ తో పోటీ పడి విడుదలైన మాస్ మహరాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మాత్రం కలెక్షన్ల వేటలో కొంచెం వెనుకంజలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఊహించని రీతిలో లియో , కేసరి పోటా పోటీగా ఆడడం ఒకింత శుభ పరిణామం అని చెప్పక తప్పదు.