తమిళ నాట టాప్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందాడు జోసెఫ్ విజయ్. డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో అక్టోబర్ 19న విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ముందస్తు అడ్వాన్స్ లో రికార్డు బ్రేక్ చేసింది. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇవాళ మూడో రోజు వరల్డ్ వైడ్ గా లియో రూ. 120 కోట్లకు పైగా కొల్లగొట్టడం విశేషం.
ఈ సినిమాలో తళపతి విజయ్ తో పాటు అందాల తార త్రిష కృష్ణన్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , అర్జున్ నటించారు. ఈ ఒక్క సినిమాకు ఏకంగా భారీ ఎత్తున రజనీకాంత్ కు ధీటుగా భారీ రెమ్యునరేషన్ విజయ్ తీసుకున్నట్లు టాక్.
ఈసినిమాకు అదనపు అస్సెట్ గా నిలిచాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. లియోకు సంబంధించిన పోస్టర్లు , టీజర్, ట్రైలర్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది. మొత్తంగా సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు తళపతి విజయ్.
మరో వైపు సినిమా ఆశించినంత హైప్ లో లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.