తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత జనాదరణ పొందిన నటుడు జోసెఫ్ విజయ్. లక్షలాది మంది ఫ్యాన్స్ మనోడిని తళపతి అని పిలుచుకుంటారు. తను తాజాగా నటించిన చిత్రం లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై రోజు రోజుకు ట్విస్ట్ లు ఇస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే రిలీజ్ చేసిన లియో పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ కిర్రాక్ తెప్పించేలా ఉన్నాయి.
దర్శకుడికి విజయ్ తో ఇది రెండో సినిమా. విజయ్ తో త్రిష కృష్ణన్ తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ నెలలోనే మూవీ మేకర్స్ లియోను రిలీజ్ చేస్తున్నారు. దీంతో ముందస్తు టికెట్ల కోసం భారీ డిమాండ్ ఉంటోంది. లియో చిత్రానికి సంబంధించి భారీ ఎత్తున టికెట్లను కొనుగోలు చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.
తమిళనాడులో భారీ క్రేజ్ ఉంది. మరో వైపు ఊహించని ధరకు తెలుగులో లియో రైట్స్ అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేసింది. రూ. 300 కోట్లకు పైగా భారీ ఖర్చుతో తీసిన ఈ మూవీలో విజయ్ కే సగం రెమ్యునరేషన్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మార్కెట్ లో తన క్రేజ్ ఏమిటో అంచనా వేయలేం అంటున్నారు నిర్మాతలు.
ఇక లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో విక్రమ్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక విజయ్ తో మాస్టర్ తీశాడు. ప్రస్తుతం జోసెఫ్ తీస్తున్న మూవీ రెండోది కావడం విశేషం.