భారీ అభిమానులను కలిగి ఉన్న నటుడు తలపతి విజయ్ నటించిన లియో దుమ్ము రేపుతోంది. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలోనే విడుదల కానుంది ఈ చిత్రం.
పవర్ ఫుల్, యాక్షన్ ,క్రైమ్ , థిల్లర్, రొమాంటిక్ , సస్పెన్స్ ఉండేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత బీస్ట్ లో నటించాడు జోసెఫ్ విజయ్. ఇప్పుడు మనసు పెట్టి చేశాడు. భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తీశాడు దర్శకుడు. ఇందులో కీలకమైన పాత్రల్లో త్రిష కృష్ణన్, సంజయ్ దత్ నటిస్తున్నారు.
లియో సినిమాకు రాక్ స్టార్ గా పేరు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. తాజాగా సినిమాకు సంబంధించి థర్డ్ సింగిల్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
మంచుల్లో విజయ్, ఓ పాప, త్రిష కలిసి నటించారు ఏది ఏమైనా లియో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.