Leo Movie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన లియో దుమ్ము రేపింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ప్రారంభంలో డివైడ్ టాక్ వచ్చినా ఆశించిన దానికంటే వసూళ్లు సాధించింది. ఒక పాటకు సంబంధించి విమర్శలు రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు విజయ్. సినిమా సక్సెస్ సందర్బంగా చిత్ర యూనిట్ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
Leo Movie OTT Updates
ఈ సందర్భంగా విజయ్ చేసిన ప్రసంగం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా అక్టోబర్ 19న విడుదలైన లియో ఇటు భారత్ లో అటు ఓవర్సీస్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో త్రిష కృష్ణన్ తో పాటు సంజయ్ దత్ , అర్జున్ నటించారు.
సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ టాప్ లో నిలిచింది. ఇక లోకేష్ కనగరాజ్ తనదైన మార్క్ ను ఉండేలా జాగ్రత్త పడ్డాడు. చిత్రం ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యేంత వరకు సోషల్ మీడియాను షేక్ చేసేలా ట్రై చేశాడు దర్శకుడు.
మొత్తంగా లియో(Leo Movie) తన సినీ కెరీర్ లో అత్యుత్తమ సినిమాగా ఉండి పోతుందని స్పష్టం చేశాడు తళపతి విజయ్. ఇదిలా ఉండగా ఇద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కావడం విశేషం. గతంలో మాస్టర్ తీశాడు. ఇప్పుడు లియోకు ఛాన్స్ ఇచ్చాడు విజయ్. తనపై ఉన్న నమ్మకాన్ని నిలెబెట్టుకున్నానని చెప్పాడు లోకేష్ కనగరాజ్ . ఇదిలా ఉండగా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో లియో ఈనెల 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read : Malai Movie Yogi Babu : యోగి బాబు ఉంటే చాలదా