తమిళ సినీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్ విడుదలైంది.
ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. దర్శకుడు మనసు పెట్టి చేశాడు లియోను. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
ఇదే సమయంలో ఇప్పటికే విడుదల చేసిన సాంగ్ కూడా మంచి ఆదరణ లభించింది. ప్రత్యేకించి తళపతి విజయ్ క్రేజ్ కు తగ్గట్టుడిగా లోకేష్ కనగరాజ్ తీర్చిదిద్దాడు.
గురువారం మూవీ మేకర్స్ సెకండ్ సింగల్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సింగిల్ సోషల్ మీడియాలో టాప్ లో నిలిచింది. ట్రెండింగ్ లోకి వచ్చింది.
ప్రధానంగా లియో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటుడు జోసెఫ్ విజయ్. తన మేనరిజం డిఫరెంట్ గా ఉండేలా తీర్చిదిద్దాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఫ్యాన్స్ లియోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే జైలర్ మూవీని సక్సెస్ బాట పట్టించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తిరిగి లియోకు కూడా అదే స్థాయిలో అందించారు.