Leo Movie Record : తమిళ సినీ రంగానికి చెందిన మోస్ట్ పాపులర్ నటుడు జోసెఫ్ విజయ్ నటించిన లియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ ఎత్తున టికెట్స్ అమ్ముడు పోవడం విస్తు పోయేలా చేశాయి.
Leo Movie Record Viral
ఇప్పటికే లియో చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో లియో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో తన సత్తా ఏమిటో చూపించాడు తలపతి విజయ్.
ఈ చిత్రానికి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియోకు(Leo Movie) దర్శకత్వం వహించడంతో సక్సెస్ అవుతుందన్న నమ్మకం కలిగి ఉన్నారు ఫ్యాన్స్. లియో రిలీజ్ తేదీ కంటే ఆరు వారాల ముందు యూకేలో బుకింగ్స్ తెరవడం విశేషం.
ఏకంగా 24 గంటల్లోనే 10,000 టికెట్లు అమ్ముడు పోయాయి. లియోను యాక్షన్ ప్యాక్డ్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం హై ఎనర్జీ వినోదం ఉండేలా చూశారు. ఈ మూవీలో సంజయ్ దత్ , అర్జున్ స్కీన్ ను పంచుకున్నారు.
Also Read : Keerthy Suresh Jayam Ravi : కీర్తి..జయం రవి సరైన్ స్టార్ట్