లోకేష్ కనగ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తళపతి జోసెఫ్ విజయ్ తో తీసిన లియో రికార్డుల మోత మోగిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు దర్శకుడు. అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య విడుదలైంది. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ మూవీ మేకర్స్ , నిర్మాత సైతం ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు సాధించాయి.
అంచనాలకు మించి ఆశించిన దానికంటే సక్సెస్ అయ్యింది లియో చిత్రం. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాదు నటుడు స్వంత స్థలం తమిళనాడులో రూ. 150 కోట్ల మార్క్ సాధించడం రికార్డ్ గా మిగిలింది.
ఇప్పటి దాకా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ నటించిన జైలర్ తమిళనాట దుమ్ము రేపింది. దీనిని అధిగమించేందుకు విజయ్ లియో దూసుకు పోతోంది. ఇదిలా ఉండగా గతంలో విజయ్ తో మాస్టర్ తీశాడు లోకేష్ కనగరాజ్.
ఆయన ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల కేరళకు వెళ్లాడు. అక్కడ తనను ఆదరించిన ఫ్యాన్స్ ను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు దర్శకుడు. విజయ్ కు ఉన్న సత్తా ఏమిటో లియో చూపించింది.