లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో మూవీ ఆశించిన దానికంటే ఎక్కువ వసూలు చేసింది. అక్టోబర్ 19న ఇండియాతో పాటు ఓవర్సీస్ లో విడుదలైంది. సూపర్ స్టార్ తళపతి విజయ్ తో పాటు త్రిష కృష్ణన్ , సంజయ్ దత్, అర్జున్ నటించారు. ఈ మూవీలో అన్నీ తానై వ్యవహరించారు హీరో. ఇప్పటి వరకు తొలి రోజు ఆది పురుష్ మీద రికార్డు ఉండేది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా.
ఈ ఏడాది భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ప్రభాస్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేయలేక పోయాయి. ఏకంగా తొలి రోజు రూ. 137 కోట్లు వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ గత జూన్ 16న రిలీజ్ అయ్యింది. తొలి రోజు రూ. 137 కోట్లు వసూలు చేసింది.
ఇక ఇదే ఏడు డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే నటించిన జవాన్ సైతం ఆది పురుష్ ను బ్రేక్ చేయలేక పోయింది. అది రూ. 127 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక బాద్ షా నటించిన పఠాన్ సైతం రూ. 107 కోట్లు మాత్రమే సాధించింది. ఏది ఏమైనా విజయ్ నటించిన లియో రికార్డు సృష్టించింది. ఏది ఏమైనా విజయ్ మరోసారి తనకు ఎదురే లేదని చాటాడు.