LEO Movie : ఉత్కంఠ రేపుతున్న లియో

పోస్ట‌ర్ల‌తో విజ‌య్ హ‌ల్ చ‌ల్

లోకేష్ క‌న‌గ‌రాజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మ‌నోడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ మూవీ తీశాడు. అది రికార్డ్ బ్రేక్ చేసింది. త‌ర్వాతి ప్రాజెక్టు దిగ్గ‌జ న‌టుడు జోసెఫ్ విజ‌య్ తో లియో సినిమా తీశాడు.

ఇప్ప‌టికే త‌మిళ సినీ రంగానికి చెందిన సినిమాలు ఈ ఏడాది భారీ విజ‌యాన్ని న‌మోదు చేశాయి. ప్ర‌త్యేకించి లోకేష్ క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్ , నెల్స‌న్ దిలీప్ కుమార్ తీసిన జైల‌ర్ , అట్లీ కుమార్ తీసిన జ‌వాన్ కోట్లు కుమ్మ‌రించేలా చేశాయి.

తాజాగా విజ‌య్ మేన‌రిజాన్ని మ‌రింత ఎలివేట్ చేస్తూ ఫుల్ ఫోక‌స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. త‌ళ‌ప‌తికి జోడీగా అందాల తార త్రిష కృష్ణ‌న్ న‌టిస్తుండ‌గా సంజ‌య్ ద‌త్, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగు, క‌న్న‌డ‌లో సైతం లియో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. రోజుకో పోస్ట‌ర్ తో హోరెత్తిస్తున్నారు. ఒక్కో పోస్ట‌ర్ ను ఒక్కో కాన్సెప్ట్ తో ఉండేలా తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. మ‌నోడి టేకింగ్, మేకింగ్ కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది.

పోస్ట‌ర్ల‌కు త‌గ్గ‌ట్టు క్యాప్ష‌న్ల‌తో ఆలోచింప చేసేలా చేస్తున్నాడు త‌మిళ డైరెక్ట‌ర్. తొలి పోస్ట‌ర్ కు కీప్ కామ్ అవాయిడ్ ద బ్యాటిల్ , రెండో పోస్ట‌ర్ కు కీప్ కామ్ ప్లాయ్ ద ఎస్కేప్ , మూడో పోస్ట‌ర్ కు కీప్ కామ్ రెడీ ఫ‌ర్ ద బ్యాటిల్ అంటూ రిలీజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com