తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ నటుడు జోసెఫ్ విజయ్. మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ప్రస్తుతం తను నటించిన లియో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా లియో సినిమాకు సంబంధించి కన్నడ పోస్టర్ విడుదల చేశారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.
మరో మూడు రోజుల్లో మరికొన్ని లియో పోస్టర్లను రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇదిలా ఉండగా ఈ కొత్త మూవీలో తళపతి విజయ్ తో పాటు అందాల తార త్రిష కృష్ణన్ నటించారు. ఇందులో సుప్రసిద్ద దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ , అర్జున్ , మైష్కిన్ , ప్రియా ఆనంద్ , మన్సూర్ అలీఖాన్ , సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు.
లియో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు మనోజ్ పరమహంస. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తను చేసిన రజనీ జైలర్ దుమ్ము రేపింది. ప్రస్తుతం అందరూ ఎంతో ఉత్కంఠతో లియో చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.