తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో తళపతి విజయ్. తనకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన లియో చిత్రం ఈ నెలలో విడుదల కానుంది.
ఇందులో భాగంగా రోజు రోజుకు సినిమాకు సంబంధించిన పోస్టర్లు కిర్రాక్ పుట్టిస్తున్నాయి. ఒక్కో పోస్టర్ ఒక్కో క్యాప్షన్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
లియోలో కీలకమైన ప్రతి నాయకుడి పాత్రలో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. శుక్రవారం మూవీ మేకర్స్ దుమ్ము రేపేలా ఒళ్లు గగుర్పొడిచేలా పోస్టర్ ను విడుదల చేసింది. ఆ వెంటనే వ్యూస్ తో దుమ్ము రేపుతోంది ఈ చిత్రం.
లియోలో నటుడు జోసెఫ్ విజయ్ వర్సెస్ సంజయ్ దత్ మధ్య పోరాట సన్నివేశం ఉండడాన్ని హైలెట్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా లియో చిత్రంలో కథానాయికగా లవ్లీ బ్యూటీ త్రిష కృష్ణన్ నటిస్తుండడం విశేషం. ఆమె ఇటీవల మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించింది. ఉత్తమ అవార్డు కూడా పొందింది.