లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ఆది పురుష్ తొలి రోజు వసూళ్లలో టాప్ గా నిలిచింది. రూ. 137 కోట్లు సాధించి విస్తు పోయేలా చేసింది.
తాజాగా విజయ్ లియో చరిత్రను తిరగ రాసింది. విడుదలకు ముందు బజ్ క్రియేట్ చేసింది. అంచనాలు మించి హైప్ వచ్చినా చివరకు మిశ్రమ స్పందనను లియో మూట గట్టుకుంది. అక్టోబర్ 19న ఇండియాతో పాటు ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యింది. తొలి రోజు ఆశించిన దానికంటే కలెక్షన్లు రాబట్టింది చిత్రం.
ఈ మూవీలో విజయ్ తో పాటు త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ నటించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. కాగా ఇప్పటి వరకు విడుదలై నాలుగు రోజులు అయ్యింది. మొత్తం రూ. 400 కోట్లు కలెక్షన్లు చేసినట్లు తమిళనాడు సినీ వర్గాల భోగట్టా.
ఇక ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు. దర్శకుడి ప్రతిభ ఇందులో ఏముందన్న ప్రశ్న కూడా వస్తోంది. విజయ్ తో లోకేష్ కనగరాజ్ కు ఇది రెండో సినిమా. అంతకు ముందు మాస్టర్ తీశాడు. మొత్తంగా దళపతి సక్సెస్ అయ్యాడా లేదా అన్నది ఇంకొద్ది కాలం ఆగితే కానీ చెప్పలేం.