Big Boss 7: బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

Hello Telugu - Big Boss 7

Big Boss 7: కింగ్ నాగార్జున్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోపై హైకోర్టు న్యాయవాది అరుణ్… తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి షోల వలన యువత చెడు దాడులు పట్టే అవకాశం ఉందని… అంతేకాకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కూడా ఆయన మానవ హక్కుల కమీషన్ కు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే బిగ్‌ బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవే దీనికి కారణంగా తెలుస్తోంది.

Big Boss 7 – బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు ?

బిగ్ బాస్ సీజన్ 7(Big Boss 7) ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవ జరిగింది. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో పాల్గొన్న అమర్‌దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. ఈ దాడిలో వారి కార్ల అద్దాలు పగిలాయి. దీనితో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ తరువాత అభిమానులు ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు… సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్‌ పేరు ఉన్నట్లు సమాచారం.

నాగార్జున అరెస్టుకు న్యాయవాది అరుణ్ డిమాండ్

అయితే బిగ్‌ బాస్‌ ఫైనల్‌ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయినప్పటికీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వలనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ షో నిర్వాహకులపైన గాని హోస్ట్ పైన గాని కేసును నమోదు చేయలేదు. దీనిపై స్పందించిన న్యాయవాది అరుణ్… హైకోర్టుకు లేఖ రాయడంతో పాటు మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నాగార్జున పేరును చేర్చడంతో పాటు అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Also Read : Ram Charan: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సేవలో రామ్ చరణ్ కుటుంబం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com