Lavanya Tripathi: వెబ్ సిరీస్ తో వస్తున్న మెగా కోడలు !

వెబ్ సిరీస్ తో వస్తున్న మెగా కోడలు !

Hello Telugu - Lavanya Tripathi

Lavanya Tripathi: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమపెళ్లి చేసుకుని మెగా కోడలు అయిపోయింది లావణ్య త్రిపాఠి. 2016లో ‘మిస్టర్’ సినిమా షూటింగ్ లో మెగాహీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడిన ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ… దాదాపు ఏడేళ్ల తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి నవంబరు 1న ఇటలీలోని టస్కానీ వేదికగా ఒకటైయింది ఈ ప్రేమ జంట. అయితే పెళ్ళి తరువాత హనీమూన్, భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న లావణ్య… ఇప్పుడు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెయిన్ రోల్ లో తెరకెక్కించిన ‘మిస్ ఫెర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ‘మిస్ ఫెర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనితో మెగా కోడలు లావణ్య పెళ్లి తరువాత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనుంది.

Lavanya Tripathi is on Web Series

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లావణ‍్య త్రిపాఠి… మిస్టర్, మనం, దూసుకెళ్తా, భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, అంతరిక్షం, ఇంటెలిజెంట్, అర్జున్ సురవరం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 2022లో ‘హ్యాపీ బర్త్ డే’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన లావణ్య త్రిపాఠి… గతేడాది వరుణ్ తో పెళ్లి పీటలెక్కి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కాకపోతే ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్‌లో నటించి… మంచి మార్కులు సంపాదించింది. ఇప్పుడు ‘మిస్ ఫెర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్ లో నటిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ బట్టి చూస్తే బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్… లావణ్యకు జోడీగా నటించనున్నాడు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో ‘మిస్ ఫెర్ఫెక్ట్’ వెబ్ సిరీస్‌తో పాటు ‘తనల్’ అనే తమిళ మూవీ కూడా ఉంది. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. అంటే ఈ రెండు చేసిన తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా అనే డౌట్ వస్తుంది.

Also Read : Director Sankar: ‘భారతీయుడు 2’ కు ప్యాకప్ చెప్పిన శంకర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com