Lavanya Tripathi: పెళ్ళి తరువాత సినిమాలపై క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు !

పెళ్ళి తరువాత సినిమాలపై క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు !

Hello Telugu - Lavanya Tripathi

Lavanya Tripathi: సాధారణంగా పెళ్ళైన తరువాత హీరోయిన్లు సినిమాల్లో నటించడం తగ్గించేస్తారు. దీనికి కారణం పెళ్ళి తరువాత బాధ్యతలు పెరగడం… ఫ్యామిలీ లైఫ్ కు ప్రాధాన్యత ఇవ్వడం. ఒకవేళ నటించినా ఎక్సపోజింగ్ చేసే గ్లామర్ పాత్రలు కాకుండా… డీసెంట్ పాత్రల్లో నటిస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమ పెళ్ళి తరువాత ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోన్న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)… మెగా కోడలిగా బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడానికి మెగా ఫ్యామిలీలో కలిసి బెంగుళూరు వెళ్ళిన లావణ్య… తన అత్తతో కలిసి సున్నుండలు చేసింది. ఈ విషయాన్ని మెగా పెద్ద కోడలు ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత ఏడాది నవంబరులో పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి… ఇప్పుడు ఫిబ్రవరిలో ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన లావణ్య.. పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తలో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది.

Lavanya Tripathi – లావణ్య ఏం చెప్పిందంటే ?

‘పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు. మెగా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు ఎవరు పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఇంతకు మించి ఏం కావాలి’.  ‘మా వరకు మేం అయితే ఎప్పటిలానే ఉన్నాం. అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు. నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు. తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నాడు’ అని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. దీనితో పెళ్ళి తరువాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటిస్తానని… దానికి వరుణ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ అనుమతి కూడా ఉందని చెప్పకనే చెప్పింది.

Also Read: Sandeep Vanga: అమీర్‌ ఖాన్‌ మాజీ భార్యకు ‘యానిమల్‌’ డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com