Lavanya Tripathi : వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఉన్నట్టుండి కొత్త మూవీ చేసేందుకు ఓకే చెప్పేసింది. చాలా మంది పెళ్లాయక కొంత కాలం దూరంగా ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ మూవీనే సతీ లీలావతి. ఇందులో దేవ్ మోహన్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటించనున్నారు.
Lavanya Tripathi Movies..
దేవ్ మోహన్ మలయాళంలో సూపర్ హీరోగా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ స్టూడియోలో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. నాగ మోహన్ బాబు ఎం, రాజేష్ టి. తాతినేని నిర్మిస్తున్నారు ఈ సినిమాను. ప్రొడక్షన్ నంబర్1 పేరుతో కొత్త నిర్మాణ సంస్థకు నాంది పలికింది. ఈ చిత్రానికి భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శ్రుతి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన సత్య దర్శకత్వం వహిస్తునన్నారు.
పూజా కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకుడు జెమిని కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి. ఆనంద ప్రసాద్, అన్నే రవి , సీనియర్ దర్శకుడు టిఎల్‌వి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్ పెద్ది మొదటి క్లాప్ కొట్టగా, వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, టిఎల్‌వి ప్రసాద్ ఈ చిత్రానికి మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు.
సతీ లీలావతి అనేది ఒక రొమాంటిక్ డ్రామా అని, ఇది విస్తృత ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించబడిందని దర్శకుడు సత్య తెలిపారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ల కొత్త జంట ఈ చిత్రానికి ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
Also Read : Yash Toxic Movie : రైజింగ్ స్టార్ యశ్ లుక్ అదుర్స్