Raj Tarun : రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. కొన్ని రోజులుగా వీరిద్దరి కథ సీరియల్లా సాగుతూనే ఉంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని.. ఇప్పుడు మాల్వీ మల్హోత్రతో గడుపుతూ తనను వదిలించుకోవడానికి చూస్తున్నాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్. మాల్వీతోపాటు ఆమె కుటుంబం కూడా తనను బెదిరిస్తోందని.. కావాలనే తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే రాజ్ తరుణ్(Raj Tarun) తో ప్రేమ, పెళ్లి, సహజీవనం, మోసం ఇలా అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించింది. అయితే లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని.. ఆమె కేవలం డ్రగ్స్ బానిస అని.. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని రాజ్ తరణ్ వాదిస్తున్నాడు.
Raj Tarun-Lavanya
ఇటీవలే రాజ్‌తరుణ్ – లావణ్య కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజ్‌తరుణ్(Raj Tarun) తనను ప్రేమించి, మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు నిర్ధారించారు. వాళ్లిద్దరూ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావిస్తూ.. ఈ కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది.
తాజాగా తన ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారం చోరీకి గురైందంటూ లావణ్య PSలో కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. రాజ్‌తరుణ్, మాల్వీపై నార్సింగి పీఎస్‌లో దొంగతనం కేసు పెట్టింది లావణ్య. తన ఇంట్లో 12 లక్షల విలువైన బంగారం చోరీ జరిగిందని, పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు రాజ్‌తరుణ్ ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. తాళితో పాటు డాక్యుమెంట్లు తీసుకెళ్లాడని స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. 4 నెలల క్రితం తాను జైలుకు వెళ్లిన టైమ్‌లో ఇంటి తాళాలు రాజ్‌తరుణ్ దగ్గరే ఉండిపోయాయని, రీసెంట్‌గా ముంబై వెళ్లి తాళాలు తీసుకుని ఇంటికి వెళ్లి చూస్తే బంగారం చోరీ అయినట్టు గుర్తించానని లావణ్య చెప్పుకొచ్చింది.
Also Read : Shilpa Shetty : గణపతి బప్పా అంటూ తీన్మార్ డాన్స్ చేసిన నటి శిల్పా శెట్టి