Latha Rajanikanth: ఓ ఛీటింగ్ కేసులో సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు(Latha Rajanikanth) బెయిల్ మంజూరైంది. కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజనీకాంత్ పై నమోదైన నాన్ బెయిలబుల్ కేసు విషయంలో డిసెంబర్ 1, 2023న కోర్టు బెంగళూరు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనితో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్న లతా రజనీకాంత్ కు… అదే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
ఈ చీటింగ్ కేసు గురించి లతా రజనీకాంత్ మాట్లాడుతూ. ‘‘సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించేందుకు పెట్టిన కేసు ఇది. సెలబ్రిటీలుగా ఉన్నందుకు మేము మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ కేసు పెద్దది కాకపోవచ్చు కానీ దీని గురించి భారీగానే ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి మోసం జరగలేదు. పలు కథనాల్లో ప్రచురితమైనట్లు ఆ డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా మీడియా వన్, సంబంధిత వ్యక్తులకు మధ్య జరిగిన వ్యవహారం. ఇప్పటికే వాళ్లు ఈ సమస్యను సెటిల్ చేసుకున్నారు. ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్నా’’ అని ఆమె స్పష్టం చేసారు.
Latha Rajanikanth – అసలేం జరిగిందంటే ?
రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన 3డీ మోషన్ క్యాప్చర్ మూవీ ‘కొచ్చాడయాన్’. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించింది. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ డైరక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్… రూ. 6.2 కోట్ల రూపాయలు రుణం తీసుకోగా… దీనికి లతా రజనీకాంత్ గ్యారంటెర్ గా సంతకం పెట్టారు.
అయితే మురళీ మనోహర్… తమకు డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొంతకాలం క్రితం బెంగుళూరు కోర్టును ఆశ్రయించింది. దీనితో గ్యారెంటర్ గా ఉన్న లతా రజనీకాంత్(Latha Rajanikanth) ను కూడా ఈ కేసులో నిందితునిగా భావిస్తూ బెంగుళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనితో లతా రజనీకాంత్ ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకోవడంతో… తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు… రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Also Read : Rubina Dilaik: కవల పిల్లలకు జన్మనిచ్చిన బిగ్ బాస్ విన్నర్