నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ దుమ్ము రేపింది. రికార్డుల మోత మోగించింది. తాజాగా తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. తలైవా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఇప్పటికే లాల్ సలామ్ కు సంబంధించిన పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ మేనరిజంకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తపడ్డారు. హీరో ధనుష్ తో విడి పోయాక ఐశ్వర్య పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టింది.
ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తుండడం విశేషం. రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ సూపర్ స్టార్ కు తోడుగా ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది.
ఆదివారం ట్విట్టర్ వేదికగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా తలైవా లాల్ సలామ్ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో జైలర్ తర్వాత లాల్ సలామ్ కూడా అదే రీతిన సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు దర్శకురాలు. ప్రత్యేకించి తలైవా స్టార్ డమ్ ఇందుకు పనికి వస్తుందని అనుకుంటోంది.