Lal Salaam: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘లాల్ సలాం’. ఈ సినిమాలో తలైవా రజనీకాంత్…. మొయిద్దీన్ భాయ్ గా అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్, జీవిత అతిథి పాత్రల్లో కనిపిస్తుండగా… ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్… తరువాత ‘లాల్ సలాం(Lal Salaam)’ గా వస్తుండటంతో తలైవా అభిమానులు ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను కొన్ని అరబ్ దేశాలు నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మత పర విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నదంటూ ఈ సినిమాపై బ్యాన్ విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సినియా యూనిట్ నుండి ఇంకా ఎలాంటి స్పందన ఇంకా రాలేదు.
Lal Salaam Movie Updates
ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన కాధల్ ది కోర్ సినిమాపై కూడా అరబ్ దేశాలు బ్యాన్ విధించాయి. పక్షం రోజుల క్రింద విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాను సైతం కొన్ని అరబ్ దేశాలు నిషేధం విధించాయి. ఇప్పుడు లాల్ సలామ్ కూడా ఆ లిస్టులో చేరింది. అయితే లాల్ సలామ్ సినిమాను ఆది నుండి కూడా ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా పలుమార్లు వాయిదా పడి చివరకు ఫిబ్రవరి 9న వస్తున్న ఈ సినిమాపై తమిళనాట బాగా రాద్ధాంతం అయ్యింది. ఈ సినిమా దర్శకురాలు, రజనీకాంత్ వారసురాలు ఐశ్వర్య చేసిన ప్రసంగాలు ఈ రచ్చకు కారణం కాగా… అరబ్ దేశాలు ఈ సినిమాపై నిషేధం విధించడం చూస్తే సినిమా వసూళ్ళపై భారీగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Guntur Karam in OTT: ఓటీటీలోకి ‘గుంటూరుకారం’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?