Laggam : సుభిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం లగ్గం. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల రచన మరియు దర్శకత్వం వహించారు. తెలంగాణా పెళ్లి పండుగ మరియు చిందు సంభ్రమాన్ని సినిమాలో విజువల్ ట్రీట్‌గా చిత్రీకరించారు. తాజాగా, తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా చిత్ర షూటింగ్ స్థితికి సంబంధించిన అప్డేట్లతో పాటు మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తోంది. అనెలా మేకర్స్ ఈ పండుగ కోసం పర్ఫెక్ట్ పోస్టర్ని డిజైన్ చేశారు. ఫెస్టివల్ స్పెషల్ గా చిత్రయూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ విశేష ఆదరణ పొందుతోంది.
Laggam Movie Updates
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ – “ఇదొక కల్చరల్ ఫ్యామిలీ డ్రామా. విడుదలైన తర్వాత అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు, కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. ఇది రాబోయే తరాలకు గుర్తుండిపోయే సినిమా అవుతుందని గ్యారెంటీ ఇస్తున్నాను. ప్రస్తుతం కామారెడ్డి, జనగామ, బీబీపేట్-ఇస్సానగర్ ప్రాంతాల్లో 70% షూటింగ్ పూర్తి చేసుకున్నారు. 3 పాటలు కూడా చిత్రీకరించాం. ఏప్రిల్ 11 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని” చెప్పారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), రోహిణి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Hero Raviteja : 75వ సినిమాకి సిద్ధమవుతున్న మాస్ మహారాజా రవితేజ