Swathini : మోస్ట్ పాపులర్ నటుడు మెగాస్టార్ తో సమావేశం కావడం అంటే మాటలు కాదు. ఏకంగా 2 గంటలకు పైగా ఓ మహిళా దర్శకురాలు చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీసేలా చేసింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా స్వాతిని(Swathini). తనకు నాగబాబు కొణిదెల కూతురు నిహారికతో మంచి స్నేహం ఉంది. ఆ పరిచయం మెగాస్టార్ తో భేటీ అయ్యేలా చేసింది.
Director Swathini Meet Chiranjeevi
స్వాతినికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. అంతకు మించి ఆరాధన. ప్రతి ఫ్రేమ్ ను అందంగా మల్చాలని, జీవితాన్ని కాన్వాస్ గా తెరకెక్కించే ప్రయత్నం చేయాలని కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైంది. ఈ విషయాన్ని లేడీ డైరెక్టర్ తన ఎక్స్ హ్యాండిల్ వేదికగా పోస్ట్ చేసింది. తన జీవితంలో మరిచి పోలేని అనుభవం ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ హోదా స్వంతం చేసుకున్న, లక్షలాది మందికి ఆరాధ్య దైవంగా భావించే చిరంజీవిని కలుసు కోవడమేనని పేర్కొంది.
నిహారిక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టింది. వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. స్వాతినికి నిహారికకు మధ్య స్నేహం నాలుగేళ్ల నుంచి ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ వచ్చేసింది. ఈ సందర్బంగా నిహారిక, నాగబాబు, మెగాస్టార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తను కలలో కూడా అనుకోలేదు మెగాస్టార్ ను కలుస్తానని పేర్కొంది.
ప్రస్తుతం మెగాస్టార్ బిజీగా ఉన్నారు. విశ్వంభర పూర్తయ్యేలా ఉంది. త్వరలో అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. మరి నెక్ట్స్ స్వాతినికి ఛాన్స్ ఏమైనా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Hero Charan-Allu Arvind :చెర్రీ నాకు మేనల్లుడు..బిడ్డ లాంటోడు