Mohan Lal : మలయాళంలో వచ్చిన లూసిఫర్ సెన్సేషన్. దానికి కొనసాగింపుగా వచ్చిన ఎల్2 ఎంపురాన్(L2 Empuraan) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తో త దూసుకు పోతోంది. మలయాళంలో అత్యధిక ఓపెనర్ మూవీగా నిలిచింది. ఏకంగా రూ. 22 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్ర పోషించాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ లాల్ , సుకుమారన్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రేక్షకులను మెప్పించేలా చేశారు.
Mohan Lal – L2 Empuraan Updates
ప్రత్యేకించి టేకింగ్ లో , మేకింగ్ లో తమదైన శైలిని చూపించే ప్రయత్నం చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలె క్షన్స్ వసూలు చేయడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఎంపురాన్ మార్చి 27న గురువారం విడుదలైంది. 2019లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఎంపురాన్ ను తెరకెక్కించాడు దర్శకుడు, నటుడు సుకుమారన్.
ఎంపురాన్ మలయాళంలో మొత్తం 61.02 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించిందని ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ వెల్లడించారు. రాత్రి అత్యధికంగా 66 శాతం చూడడం విశేషం. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్స్ అయితే ఏకంగా ఎంపురాన్ మూవీని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రశంసలు కురిపించాడు. మూవీ కేరళ, తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కొట్టాయం, త్రిస్పూర్, పాలక్కాడ్ అంతటా రికార్డు స్థాయిలో నడుస్తుండం విశేషమని పేర్కొన్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే మలయాళ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్ అవుతుందన్నాడు.
Also Read : Neha Kakkar Husband Shocking :నేహా కక్కర్ ఆవేదన భర్త ఆలంబన