Kushi Movie : శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషీ చిత్రం ఆదరణ చూరగొంటోంది. విజయ్ దేవరకొండ, లవ్లీ బ్యూటీ సమంత రుత్ ప్రభు కలిసి నటించిన ఖుషీ సెప్టెంబర్ 1న విడుదలైంది. ఓవర్సీస్ లో ఏకంగా ఈ చిత్రం రెండు రోజులకే రూ. 10 కోట్లు వసూలు చేసింది. ఇది ట్రేడ్ వర్గాలను సైతం విస్తు పోయేలా చేసింది.
Kushi Movie Talk
శివ నిర్వాణ దర్శకత్వం ప్రధానంగా అస్సెట్ గా నిలిచింది. ప్రత్యేకించి ఖుషీ మూవీకి అందించిన సంగీతం, మదిని దోచుకునే పాటలు కిర్రాక్ తెప్పించేలా చేశాయి. అంతకు మించి గుండెల్ని మీటే సన్నివేశాలు ఖుషీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.
ఇక విడుదలైన ఖుషీ మూవీకి(Kushi Movie) అమెరికాలో భారీ ఆదరణ లభిస్తోంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఓవరాల్ గా. ఆరాధ్యగా సమంత నటన హైలెట్ గా మారింది. ఆమెకు వరుసగా ఇది బిగ్ హిట్ అని చెప్పక తప్పదు. సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ చిత్రంలో ఐటం సాంగ్ లో నటించింది.
చంద్రబోస్ రాయగా దేవిశ్రీ ప్రసాద్ స్వర పరిచారు. ఈ సాంగ్ ను మంగ్లీ సిస్టర్ పాడింది. ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా అన్న పాట దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇందులో సమంత రుత్ ప్రభు అద్బుతంగా నటించింది. ఆ తర్వాత నటించిన చిత్రం ఖుషీ. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో కొంత సంతోషానికి లోనైంది.
Also Read : R Madhavan : ఎఫ్టీఐఐ ప్రెసిడెంట్ గా మాధవన్