Kushi Movie : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు కలిసి నటించిన ఖుషీ చిత్రం దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హృద్య కావ్యంగా తీర్చిదిద్దాడు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ పేరుతో సినిమా తీశాడు. అప్పట్లో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Kushi Movie Trending
పవన్ ఫ్యాన్స్ సైతం పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు తాజా ఖుషీ చిత్రంపై. కానీ శివ నిర్వాణ మాత్రం ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తీశాడు. ప్రత్యేకించి సకుటుంబ సమేతంగా దీనిని తీసే ప్రయత్నం చేశాడు.
ఇటు తెలుగులోనే కాకుండా అటు ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఖుషీ మూవీ(Kushi Movie). ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ఆదరిస్తున్నారు ప్రత్యేకించి అమెరికాలో. ప్రవాస ఆంధ్రులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ కు సంబంధించిన చిత్రాల కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది తాజా శివ నిర్వాణ ఖుషీ మూవీ. చిరంజీవి వాల్తేరు వీరయ్య , దసరా, బ్రో చిత్రాలకు మించి విజయ్ దేవర కొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషీ ఎక్కువగా వసూలు సాధించడం విస్తు పోయేలా చేసింది.
హీరో, హీరోయిన్ల కంటే చిత్రానికి సంబంధించి కంటెంట్ ఉంటే చాలు ఏ మూవీ అయినా సక్సెస్ అవుతుందని ఖుషీ నిరూపించింది.
Also Read : Wamiqa Gabbi Vs Komalee Prasad