Kushi Collections : శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి(Kushi) మూవీ దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , లవ్లీ బ్యూటీ సమంత రుత్ ప్రభు నటించారు.
Kushi Collections Hype
సినిమాకు సంబంధించి పాటలు, మాటలు, సన్నివేశాలు యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునేలా చేశాయి. ఇందుకు ప్రత్యేకంగా అభినందించాల్సింది దర్శకుడు శివ నిర్వాణ్. హిట్ టాక్ తో ముందుకు దూసుకు పోతోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.
రూ. 15 కోట్ల షేర్ కలెక్షన్స్ చేయడం మామూలు విషయం కాదు. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు కొల్లగొట్టడం విస్తు పోయేలా చేస్తోంది. ట్విట్టర్ వేదికగా సోమవారం మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా రూ. 70 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
దీన్ని బట్టి చూస్తే రూ. 33 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయడం ఆశ్చర్య పోయేలా చేసింది. రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ వ్యాపారం చేసింది. ప్రస్తుత సిట్యూయేషన్ బట్టి చూస్తే ఖుషి చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ అంచనా వేస్తోంది.
Also Read : Chandramukhi2 : చంద్రముఖి-2 ట్రైలర్ అదుర్స్