Kusha Kapila : విడాకులు తీసుకుంటే కామెడీ పేరుతో అవమానిస్తున్నారు

అక్కడ ఉన్న అడియన్స్, సాంకేతిక నిపుణులు ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు...

Hello Telugu - Kusha Kapila

Kusha Kapila : బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ కమెడియన్ కుశా కపిలా. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. అటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాపులారిటిని సొంతం చేసుకుంది. ప్లాన్ ఏ ప్లాన్ బి, సెల్ఫీ, థాంక్యూ ఫర్ కమింగ్ వంటి చిత్రాల్లో నటించిన కుశా(Kusha Kapila).. ఇటీవల ప్రెట్టీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది. అక్కడ స్టాండప్ కమెడియన్స్ తనపై జోక్స్ వేయడాన్ని సహించలేకపోయింది. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ జోక్స్ వేయడం పై మండిపడింది. అంతేకాకుండా విడాకుల గురించి తనపై సెటైర్స్ వేయడం.. వైవాహిక జీవితం గురించి జోక్స్ మాట్లాడడంపై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుశా కపిలా మాట్లాడుతూ.. కామెడీ పేరుతో తనను అవమానించారని.. విడాకులు తీసుకుంటే తమను విలన్లుగా చూస్తున్నారని తెలిపింది.

Kusha Kapila Comment

“నా స్నేహితులు చెప్పారని ఆ షోకు వెళ్లాను. కానీ అక్కడ నన్ను ఈ రేంజ్ లో రోస్ట్ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్ చేశరనేది నేను ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్ పై నమ్మకంతోనే అడకుండానే వెళ్లాను. నిజానికి అది నా తప్పే. అక్కడ ఉన్న అడియన్స్, సాంకేతిక నిపుణులు ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్ కాదు.

ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ దానిని అడ్డుకుంటే నేను పిరికిదానిని అంటూ ట్రోస్ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానిచ్చాను. ఆ తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్స్ లో వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చినట్లు జోక్స్ వేయలేదు. ఈ ఆరు నెలలో నేను గమనించాను.. విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అనేస్తారు. వారిని రాక్షసులుగా చూస్తారు. మహిళా కాళకారులు కఠినమైన రైడర్స్ గా ఉండాలని సలహా ఇస్తున్నాను. ” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : Varsha Bollamma : విడాకులపై వస్తున్న ప్రశ్నలకు సింపుల్ గా సమాధానమిచ్చిన వర్ష

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com