Monalisa : ఉత్తర ప్రదేశ్ లోన ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభ మేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మోనా లిసా. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారి పోయారు. ఈ సందర్బంగా ఎక్కడ చూసినా తనే దర్శనం ఇస్తోంది. తన గురించి ఇంటర్నెట్ లో తెగ వెతుకుతుండడంతో ఎవరీ యువతి అని ఆశ్చర్య పోతున్నారు. విస్మయానికి లోనవుతున్నారు.
Beauty Monalisa Movie Chance..
మహా కుంభ మేళాలో పూసలు అమ్ముతూ కనిపించారు. ప్రతి ఒక్కరిని తను పలకరించే విధానం చూసి ఆనందానికి లోనయ్యారు. దిగ్గజ ప్రచురణ, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మోనా లిసా దర్శనం ఇస్తూ వస్తోంది.
ఇదిలా ఉండగా సంచలన ప్రకటన చేశారు సినీ దర్శకుడు సనోజ్ మిశ్రా. త్వరలోనే తాను తీయబోయే సినిమాలో అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. తాను మోనా లిసాను కలుస్తానని వెల్లడించారు. కాగా మోనాలిసాది స్వస్థలం మధ్య ప్రదేశంలోని ఇండోర్ నగరం. కుంభమేళాలో పూసలు దండలు అమ్ముకుంటున్న మోనాలిసా రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. తనకు జీవితంలో మూవీ ఛాన్స్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు యువతి మోనాలిసా.
Also Read : IT Raids – Shocking Producers : మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు