మూవీ రంగానికి సంబంధించి సక్సెస్ ఉన్నంత వరకే పలకరింపులు. ఆ తర్వాత ఎవరూ ఆదరించరు. బాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ తక్కువై పోయాయి. అడ్వెంచర్, థ్రిల్లర్, రొమాంటిక్ కు సంబంధించి ఉన్న వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సినీ ఫ్యాన్స్.
దీంతో ప్రతి మూవీ మరింత ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు దర్శక, నిర్మాతలు. ఇక హీరోయిన్లు ఒకప్పుడు కేవలం అలా వచ్చి ఇలా వెళ్లి పోయే వాళ్లు. కానీ సీన్ మారింది. హీరోతో పోటీగా అన్నీ చేయాల్సి వస్తోంది.
ఇందుకు తాజా ఉదాహరణే జెస్సీ పాత్రలో జీవిస్తోన్న కృతీ సనన్. గణపత్ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ మూవీ తనకు మరింత పేరు తీసుకు వచ్చేలా చేస్తోందని అంటోంది. డార్లింగ్ ప్రభాస్ తో ఆది పురుష్ లో నటించింది. కానీ ఆశించినంత మేర రాణించ లేక పోయింది.
కిక్ బాక్సింగ్ , నంచుక్స్ పై విపరీతమైన శిక్షణ పొందాను. ఇది ఒక రకంగా తనకు ఛాలెంజ్ లాంటిదని పేర్కొంది కృతీ సనన్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.