Kriti Sanon: తనకు కాబోయే భర్త తన వృత్తిని గౌరవించాలన్నారు హీరోయిన్ కృతి సనన్. నటిగానే కాకుండా నిర్మాతగానూ బిజీగా మారిన ఆమె తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన గుణగణాలను వర్ణించారు.
Kriti Sanon Husband Qualities
‘‘ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడికి లోనవుతాం. అందుకే నేను ఆశ పెట్టుకోను. ఏది జరిగినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ సమయం గడపాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. నన్ను బాగా చూసుకోవాలి. అన్ని విషయాల్లో నాకు సరితూగాలనే కోరిక లేదు’’ అని చెప్పారు. గత కొంతకాలంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి(Kriti Sanon) డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరలైంది. దీనితో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. అయితే వీటిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.
ఒక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే… ‘ది క్రూ’తో కృతి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాజేశ్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె ‘దో పత్తీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్’ పతాకంపై ఆమె నిర్మించనున్న మొదటి సినిమా ఇది. దీనికోసం రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్, పాత్రలు, సంగీతం అన్ని విభాగాల్లోనూ భాగమైనట్లు తెలిపారు. నటిగా ఎంతోమంది అభిమానిస్తున్నారని.. నిర్మాతగానూ తనను ఆదరించాలని కోరారు.
Also Read : Richa Chadha: సినిమా షూటింగ్ లో మద్యం తాగిన బాలీవుడ్ బ్యూటీ !