Kriti Kharbanda: పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి !

పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి !

Hello Telugu - Kriti Kharbanda

Kriti Kharbanda: టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, మీరా చోప్రా, లావణ్య త్రిపాఠీలు ఇప్పటికే పెళ్ళి పీటలెక్కగా… వరలక్ష్మీ శరత్ కుమార్, సింగర్ హారికా నారాయణ్ లు ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమౌతున్నారు. వీరి బాటలో టాలీవుడ్ బ్యూటీ కృతి కర్భందా(Kriti Kharbanda) తన ప్రియుడిని పెళ్ళి చేసుకుంది. తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌ లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా… ‘వీరే కి వెడ్డింగ్’, ‘తైష్’, ‘పాగల్పంటి’లో నటించిన పుల్కిత్ సామ్రాట్‌ తో ఏడుఅడుగులు నడిచింది. హర్యానాలోని మానేసర్‌ లో ఐటీసీ గ్రాండ్ భారత్‌ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. దీనితో కృతి కర్భందా, పుల్కిత్ సామ్రాట్ కు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kriti Kharbanda Marriage Updates

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృతి కర్బందా… బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తో గత రెండేళ్ళుగా డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. అయితే వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… నెల తిరగక ముందే పెళ్ళి పీటలు ఎక్కేసింది. కాగా పుల్కిత్ కి గతంలో శ్వేతా రోహిరా అనే అమ్మాయితో వివాహం అయింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2015లో ఆమె నుండి పుల్కిత్ విడాకులు తీసుకున్నారు.

బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా… ఆ తరువాత అలా మొదలైంది, తీన్‌ మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో సినిమా వచ్చే మే నెలలో విడుదల కానుంది.

Also Read : Sharathulu Varthisthai: ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలో పాటను విడుదల చేసిన మాజీ మంత్రి కేటీఆర్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com