క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన బుచ్చిబాబు తీసిన ఉప్పెన రికార్డ్ బ్రేక్ చేసింది. కుర్రకారు గుండెల్ని మీటింది. ప్రేమ కథ తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతీ శెట్టి.
ఆ ఒక్క మూవీ ఆమెను సినీ ఇండస్ట్రీలో తన వైపు తిప్పుకునేలా చేసింది. అందులో ఆమె పేరు బేబమ్మ. ప్రతి ఒక్కరూ ఆమెను ఆ పేరుతోనే పిలవడం ప్రారంభించారు. విశాఖ సముద్రాన్ని తెరపై గొప్పగా ఆవిష్కరించాడు దర్శకుడు బుచ్చిబాబు.
ఇదంతా పక్కన పెడితే ఆ తర్వాత నటించిన సినిమాలు కృతీ శెట్టి ఆశలపై నీళ్లు చల్లాయి. నేచురల్ స్టార్ నానితో నటించిన శ్యామ్ సింగ రాయ్ , రామ్ పోతినేని తో నటించిన వారియర్ , నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం, అక్కినేని నాగ చైతన్యతో నటించిన కస్టడీ పూర్తిగా ఆశించిన మేర రాణించ లేదు. దీంతో వరుస పరాజయాలు కృతీ శెట్టిని మరింత ఇబ్బందికి గురి చేశాయి.
దీంతో ప్రస్తుతం కేవలం తమిళ సినిమాలో నటిస్తోంది. ఆ ఒక్క దానిపైనే ఈ బేబమ్మ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే కెరీర్ ఉన్నట్టు లేదంటే ఇబ్బందుల్లో పడడడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.