Krishna Vamsi: టాలీవుడ్ అగ్రదర్శకుడు కృష్ణ వంశీ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి సినిమా నుండి ఆయన మరింత యాక్టివ్ గా ఉంటూ.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ… పవన్ పై దర్శకుడు కృష్ణ వంశీ(Krishna Vamsi) ప్రశంసలు జల్లు కురిపించారు.
Krishna Vamsi Comment
‘మీ సినిమాలంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా’ అని ఓ నెటిజన్ ఎక్స్ లో కృష్ణవంశీని అడిగారు. దానికి ఆయన సమాధానమిచ్చారు. ‘మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. నిజం ఎప్పటికైనా నిజమే. దాన్ని నిరూపించడానికి ఎవరి అంగీకారం అవసరం లేదు. పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో. ఇది మరోసారి రుజువైంది. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఎంతోమంది రావాలి. యోగి ఆదిత్యానాథ్ తర్వాత అలాంటి విలువలు, తెలివితేటలు కలిగిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్. దేవుడు ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట్ వైరల్ గా మారుతోంది.
Also Read : Lokesh Kanagaraj : తన సినిమా సీన్స్ లీక్ పై ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్