Krishna Vamsi: పవన్ కళ్యాణ్ తో సినిమాపై కృష్ణవంశీ ఆశక్తికర వ్యాఖ్యలు !

పవన్ కళ్యాణ్ తో సినిమాపై కృష్ణవంశీ ఆశక్తికర వ్యాఖ్యలు !

Hello Telugu - Krishna Vamsi

Krishna Vamsi: టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ కృష్ణవంశీ గత కొంతకాలంగా సోషల్ మీడియాల యాక్టివ్ గా ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఎక్స్‌ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల రీ రిలీజ్ చేసిన మురారి సినిమా గురించి ఆయన ఎక్స్‌ లో స్పందించారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును పురష్కరించుకుని రీ రిలీజ్ అయిన మురారి సినిమా థియేటర్ లో కొంతమంది అభిమానులు పెళ్ళి చేసుకోవడం… ఆ వీడియోలను తనకు ట్యాగ్ చేయడంపై కృష్ణవంశీ తనదైన శైలిలో స్పందించారు. ఒకవైపు మురారి సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను పొగుడుతూనే… థియేటర్లలో పెళ్ళి చేసుకోవడం ద్వారా హిందూ వివాహ వ్యవస్థను కించపరచకూడదంటూ క్లాస్ పీకారు.

Krishna Vamsi Comment

ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi). ఈ సందర్భంగా ‘మురారి’ సీక్వెల్‌ ని , పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రెండేళ్ల తర్వాత ‘మురారి’ సీక్వెల్‌ తెరకెక్కించండి’’ అని నెటిజన్‌ అడగ్గా… ‘‘ఆ విషయాన్ని మీరు, నేను చెప్పకూడదు. మహేశ్‌, నమ్రత, గౌతమ్‌ నిర్ణయించాలి. కాబట్టి వాళ్లనే డిసైడ్‌ చేయనిద్దాం’’ అని చెప్పారు.

‘పవన్‌కల్యాణ్‌కు మీరు ఎప్పుడైనా స్టోరీ చెప్పారా? మీ కాంబోలో సినిమా వస్తే బాగుండేది’’ అని మరో నెటిజన్ కోరగా దీనిపై దర్శకుడు స్పందించారు. ‘‘చెప్పాను. సినిమా చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఆ ఛాన్స్ మిస్‌ చేసుకున్నా. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే బాక్సాఫీస్‌ వద్ద పెద్ద బ్లాస్ట్‌ అయ్యేది. అది నా దురదృష్టం అంతే’’ అని అన్నారు. ‘‘మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు మీ నుంచి మురారి లాంటి చిత్రాలు కావాలి అంతే మీదే బాధ్యత’’ అని నెటిజన్‌ అనగా.. ‘‘సరే డబ్బులు తీసుకుని వచ్చేయండి… సినిమా తీద్దాం’’ అని సరదాగా సమాధానమిచ్చారు.

Also Read : Nag Ashwin: గొప్ప మనసు చాటుకున్న ‘కల్కి’ డైరెక్టర్ ! స్కూల్ బిల్డింగ్ కు రూ.66 లక్షలు విరాళం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com