Konidela Nagababu: ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టించింది. ఎన్డీఏ కూటమి ఏర్పడంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత… ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి ముఖ్య కారణమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాను కొన్ని సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ తో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారారు. ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా మొదట జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను టీడీపీ కేటాయించినప్పటికీ… వీరి కూటమిలో బీజేపీ చేరిన తరువాత పవన్ కళ్యాణ్ తన సీట్లు తగ్గించుకొని మరీ కూటమిని నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాల్సిన తన సోదరుడు నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
Konidela Nagababu…..
అయితే ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ సీట్లతో ఘన విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలతో వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. దీనితో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వైసీపీ నాయకులు ఒక్కొక్కరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకరరెడ్డి తన పదవికి రాజీనామా చేసారు. దీనితో టీటీడీ చైర్మెన్ గా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) ను ప్రభుత్వం నియమించబోతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేన పార్టీకి, అభర్ధుల విజయానికి కీలక పాత్ర పోషించిన కొణిదెల నాగబాబు త్వరలో ఈ పదవిని స్వీకరిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నిలబెట్టిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ అఖండ విజయం సాధించి తన పార్టీ వందశాతం విజయాన్ని నమోదు చేసుకొని రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన బంధువులు ఎవరినీ తన పార్టీ తరపున నిలబెట్టలేదు. ముఖ్యంగా తన సోదరుడు నాగబాబు(Konidela Nagababu)ని కూడా ఎక్కడా నిలబెట్టలేదు. నాగబాబు మొదటినుండీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటూ, పార్టీకి ఎంతో సేవ చేశారు. ఒక సమయంలో నాగబాబుని అనకాపల్లి నుండి జనసేన పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాలని వార్తలు వచ్చాయి. అలాగే నాగబాబు(Konidela Nagababu) కూడా కొన్ని రోజులు అనకాపల్లిలో ఉండటం వలన ఈ వార్తలకి బలం చేకూరింది. కానీ అనూహ్యంగా నాగబాబుకు బదులు ఆ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, అక్కడ నుండి సీఎం రమేష్ పోటీ చేసి గెలవటం అవన్నీ తెలిసిన విషయాలే.
అయితే ఇప్పుడు నాగబాబు కి ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలిసింది. అందుకే రాష్ట్రంలో అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నాగబాబు(Konidela Nagababu) పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలిసింది. అలాగే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కూడా అవుతోంది. మెగా అభిమానులు కూడా నాగబాబు టీటీడీ చైర్మన్ గా భాద్యతలు చేపట్ట నున్నారని సంబరాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలిసింది. టీటీడీ లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకు ఎంతో ప్రక్షాళన చెయ్యాల్సి ఉందని, అందుకోసమే నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : Pawan Kalyan: ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన పవన్ కళ్యాణ్ !