Dhanush: హీరో ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ ఎత్తివేత ! కొత్త ప్రాజెక్ట్‌ లకు లైన్‌ క్లియర్‌ !

హీరో ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ ఎత్తివేత ! కొత్త ప్రాజెక్ట్‌ లకు లైన్‌ క్లియర్‌ !

Hello Telugu - Dhanush

Dhanush: కోలీవుడ్‌ హీరో ధనుష్‌పై తమిళ చిత్రపరిశ్రమ రెడ్‌కార్డ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్‌ 1 నుంచి ధనుష్‌ తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీనితో కోలీవుడ్‌ లో పెద్ద దుమారమే రేగింది. రెమ్యునరేషన్‌ తీసుకుని షూటింగ్‌ కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్‌కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ జారీ అయింది.

Dhanush…

త్రేండల్‌ ఫిల్మ్స్‌, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్‌ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్‌(Dhanush) అడ్వాన్స్‌ తీసుకున్నారట. అయితే, ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్‌కు డేట్స్‌ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ జారీ చేస్తున్నట్లు గతంలో TFPC పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్‌తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్‌కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్‌ ఫిల్మ్స్‌తో సినిమా చేయడానికి ధనుష్‌ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్‌లు TFPC తెలిపాయని సమాచారం. అయితే, కొన్ని షరతులపై ధనుష్‌ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేయబడిందని సమాచారం.

Also Read : Hema: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమకు షాక్ ! ట్విస్ట్‌ ఛార్జ్‌ షీట్‌లో హేమ పేరు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com