Raveena Ravi : కోలీవుడ్‌కు చెందిన హీరోయిన్ రవీనా తన ప్రియుడుని పరిచయం చేసింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పైగా త్వరలోనే ప్రియుడిని పెళ్ళాడనున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో డబ్బింగ్ కళాకారిణిగా కెరీర్ ప్రారంభించిన రవీనా.. ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించిన ‘లవ్‌టుడే’ చిత్రంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రవీనా(Raveena Ravi) తల్లి శ్రీజ కూడా సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా వచ్చిన మా మన్నన్ సినిమాలో ఫహద్ ఫాజిల్‌కు భార్యగా నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది.
Raveena Ravi Marriage
అయితే, ‘వాలాట్టి’ అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవన్ జయకుమార్ ను రవీనా ప్రేమించింది. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఫోటో షేర్ చేసి బహిర్గతం చేశారు. వీరిద్దరికి సినీ ప్రముఖులు ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read : Sandeep Raj : పెళ్లి పీటలెక్కనున్న కలర్ ఫోటో డైరెక్టర్ ఆ నటి