Kohli : దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ తో జరిగిన కీలక పోరులో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ(Kohli) అద్బుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. 111 బంతులు ఎదుర్కొని 100 రన్స్ చేశాడు. తన వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ సాధించాడు. ఏకంగా 51 సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీలతో సమం చేశాడు.
Virat Kohli beats Sachin Tendulkar Records
అత్యధిక వన్డే సెంచరీల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బ్యాటర్ గా నిలిచాడు. అంతకు ముందు శిఖర్ ధావన్, గంగూలీ, సచిన్ టెండూల్కర్, మహ్మద్ కైఫ్ , వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ శతకాలు చేశారు.
2009లో కోల్ కతాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 107 పరుగులతో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. 2010లో ఢాకాలో బంగ్లాతో 102 రన్స్, విశాఖలో ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో 118, గౌహతిలో న్యూజిలాండ్ తో 105 రన్స్ చేశాడు. 2011లో ఢాకాలో బంగ్లాతో 100 రన్స్ , కార్డిఫ్ లో ఇంగ్లండ్ తో 107, ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ తో 117 , విశాఖలో విండీస్ తో జరిగిన మ్యాచ్ లో 117 రన్స్ చేశాడు.
2012లో హోబర్డ్ లో శ్రీలంతో జరిగిన మ్యాచ్ లో 133 రన్స్ , మీర్బూర్ లో 108, పాకిస్తాన్ తో 183, హంబన్ తోటలో లంకతో 106, కొలంబోలో లంకతో 128 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). 2013లో విండీస్ తో 102, జింబాబ్వేతో 115, ఆసిస్ తో 100, నాగ్ పూర్ లో ఆసిస్ తో 115 రన్స్ చేశాడు.
2014లో న్యూజిలాండ్ తో 123, పాక్ తో 136, విండీస్ తో 127, శ్రీలంకతో 139 పరుగులు చేశాడు. 2015లో పాకిస్తాన్ తో 107, సౌతాఫ్రికాతో 138 , 2016లో ఆసిస్ తో 117, 106 , న్యూజిలాండ్ తో 154 రన్స్ తో దుమ్ము రేపాడు. 2017లో ఇంగ్లండ్ తో 122 , విండీస్ తో 111, శ్రీలంకతో 131, 110, న్యూజిలాండ్ తో 121, 113 రన్స్ చేశాడు. 2018లో సౌతాఫ్రికాతో 112, 160, 129, విండీస్ తో 140, 157, 107 పరుగులు చేశాడు.
2019లో ఆసిస్ తో 104, 116, 123 పరుగులు చేయగా విండీస్ తో 120, 114 , 113 పరుగులు చేశాడు. 2023లోశ్రీలంకతో 113, 166, 122, 103, 101, 100 తో పాటు తాజాగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో సెంచరీ చేశాడు. రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తం 51 సెంచరీలు నమోదు చేశాడు.
Also Read : Virat Kohli Victory :విరాట్ విశ్వరూపం భారత్ విజయం