Jack : టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. మనోడి తెలంగాణ యాస, భాషకే కాదు యాక్షన్ , డ్యాన్స్ లో కూడా ఇరగ దీయడంతో ప్రేక్షకులు పెరిగి పోయారు. ప్రత్యేకించి కుర్రకారుకు ఇష్టంగా మారాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు సినిమాలు తీస్తున్నారు. మరికొందరు కేవలం కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే సినీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జాక్. ఇది పూర్తిగా యాక్షన్ , ఎంటర్టైన్ జానర్ లో తీస్తున్నాడు. దీంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి.
Jack Movie Updates
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇక తెలంగాణ పోరి వాసన కలిగిన నటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). తను తొలుత షార్ట్ ఫిలింలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తను ఇప్పుడు లవ్లీ హీరో , స్టార్ బాయ్ గా పేరొందిన సిద్దు జొన్నలగడ్డతో జత కట్టింది. ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకునేందుకు పోటీ పడుతుండడం విశేషం. దీనినే ఆధారంగా చేసుకుని చిత్రీకరించిన పాట కిస్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది సోషల్ మీడియాలో.
కథను అందంగా తెరకెక్కించడంలో మంచి పేరు కలిగి ఉన్నాడు బొమ్మరిల్లు భాస్కర్. తను సిద్దార్త్ , జెనీలియాతో తీసిన బొమ్మరిల్లు ఇప్పటికీ ఎప్పటికీ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఇక ఆ మధ్యన అక్కినేని అఖిల్ , పూజా హెగ్డేతో తీసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సిద్దు, వైష్ణవితో తీస్తున్న మూవీ ఏప్రిల్ 10న వచ్చేందుకు సిద్దంగా ఉంది. సాంగ్ మాత్రం కుర్రకారుకు కిర్రాక్ తెప్పిస్తోంది.
Also Read : Popular Actor Sethupathi-Rukmini :రుక్మిణి..సేతుపతి ఫీల్ గుడ్ సాంగ్