Kishore Reddy: శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో ఆయన వివాహం జరిగింది. హైదరాబాద్ లోని మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్ రెడ్డి వివాహం బంధంలోనికి అడుగుపెట్టారు. కిశోర్- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమతో పాటు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేసీ, కిశోర్ లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kishore Reddy Marriage Viral
శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిశోర్(Kishore Reddy)… అంతకుముందు తెలుగులో ‘లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి సినిమాలతో పాటు కన్నడంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. వ్యవసాయం నేపథ్యంలో కోవిడ్ లాకౌ డౌన్, ఆన్ లైన్ అగ్రీకల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ సినిమా… తనకు మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. ఇక అతని భార్య కృష్ణ చైతన్య విషయానికి వస్తే… యాంకర్ కేసీగా ఆమె అందరికీ సుపరిచితం. కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు ప్రస్తుతం ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది.
Also Read : Director Krish : డ్రగ్స్ కేసు విచారణకై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన క్రిష్