Aamir Khan : బాలీవుడ్ లో చెరపలేని స్వరం కిషోర్ కుమార్. తను లేక పోయినా ఆయన పాడిన పాటలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం ఆధారంగా అనురాగ్ బసు బయో పిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కిషోర్ కుమార్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. అమీర్ ఖాన్(Aamir Khan) కు కిషోర్ కుమార్ అంటే చచ్చేంత ఇష్టం. ఈ సందర్బంగా దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించాడు. తాను ఓకే చెప్పాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Aamir Khan Key Role in Kishore Kumar Biopic
కిషోర్ కుమార్ బయో పిక్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ టీసీరీస్ హెడ్ భూషణ్ కుమార్ సహకారం అందిస్తున్నారు. ఇక కిషోర్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు పాడారు. సూపర్ హిట్ గా నిలిచేలా చేశాడు. తన గాన మాధుర్యానికి ఎందరో ఫిదా అయ్యారు. కిషోర్ కుమార్ పాటగాడు మాత్రమే కాదు సంగీతకారుడు, నటుడు.
కిషోర్ కుమార్ హిందీతో పాటు, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం, ఒడియా, ఉర్దూ భాషలలో ఎన్నో పాటలు పాడాడు. ఆయన పాడిన పాటలలో యే రాతీన్ యే మౌసమ్, హమ్ తో మొహబ్బత్ కరేగా, ఏ హసీనో నజ్నీనో, జరూరత్ హై జరూరత్ హై, ఖూబ్సూరత్ హసీనా , గాతా రహే మేరా దిల్ లాంటివి ఉన్నాయి.
Also Read : Namratha Shirodkar Sensational :మరిన్ని మదర్స్ మిల్క్ బ్యాంకులు రావాలి