Ka Movie OTT : అప్పుడే ఓటీటీ కి సిద్ధమైన కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా

చింతావరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు...

Hello Telugu - Ka Movie OTT

Ka Movie : పెళ్లి తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క(Ka Movie). అతని మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్ సారిక తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అల్లు అరవింద్ తదితర సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. కాగా దీపావళి పోటీలో భాగంగా క సినిమాకు తక్కువ థియేటర్లు కేటాయించారు. అయితే మౌత్ టాక్ బాగుండడంతో రోజు రోజుకీ థియేటర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.

Ka Movie OTT Updates

దీపావళికి రిలీజైన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కిరణ్ అబ్బవరం ‘క(Ka Movie)’ మూవీనే దీపావళి విన్నర్‌గా తేలిందని తెలుస్తోంది.ఇలా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోన్న క సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. నవంబర్ 21నే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తుందంటూ ప్రచారం జరగుతోంది. దీంతో చిత్ర బృందం ఈ వార్తలపై స్పందించింది. ”క’ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి రాదు. థియేటర్లలోనే చూడండి. త్వరలో ఓటీటీలో ఈ సినిమా విడుదల అవుతుందని వస్తున్న అసత్య వార్తలను నమ్మకండి’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మేకర్స్. తద్వారా క సినిమా ఓటీటీ రిలీజ్ పై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు.

చింతావరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. 1977 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో అద్బుతంగా నటించాడు. అలాగే అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజయ్యింది. కాగా క సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ తో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : Devara OTT : ఓటీటీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com