Kiran Abbavaram: కూర్గ్‌ లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి !

కూర్గ్‌ లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి !

Hello Telugu - Kiran Abbavaram

Kiran Abbavaram: టాలీవుడ్‌ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉంటూ షార్ట్ ఫిల్మ్ తో సినిమా రంగంలో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం… ఎస్ ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, సమ్మతమే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం తన ప్రేమించిన రహస్య గోరఖ్‌ తో నిశ్చాతార్థం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైపోయారు. ఆగస్టు 22న కర్ణాటకలో కూర్గ్‌ లో వీళ్ల పెళ్లి జరగనుంది. రహస్య బంధువులంతా ఆ ఊరిలోనే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు హీరో కిరణ్ స్నేహితులు, బంధువులు హాజరవుతారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

Kiran Abbavaram Marriage

సాప్ట్‌వేర్ ఇంజినీర్స్ అయిన కిరణ్, రహస్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో యాక్టింగ్ సైడ్ వచ్చాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్త.. ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్-రహస్య ప్రేమించుకుంటున్నారు. కాకపోతే ఈ ఏడాది ఆ విషయాన్ని బయటపెట్టారు.

Also Read : Nadigar Sangam: సెప్టెంబరు 8న నడిగర్‌ సంఘం 68వ సర్వసభ్య సమావేశం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com