Kiran Abbavaram : కథ మీద నమ్మకం ఉంటే ఎంత దాకైనా వెళ్లవచ్చు. ఇప్పుడు స్టార్ హీరోలను ఎవరూ పట్టించు కోవడం లేదు. ట్రెండ్ మారింది. టెక్నాలజీ ప్రవేశించింది. సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. మొత్తంగా కంటెంట్ బాగుంటే సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని తేలి పోయింది. దీంతో నిర్మాతలలో కూడా మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు హీరో, హీరోయిన్లను పట్టించు కోవడం లేదు. కేవలం కథే కింగ్ అంటూ ప్రయారిటీ ఇస్తున్నారు.
Kiran Abbavaram Offers
ఎలాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో నిలదొక్కుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు. తను తాజాగా దిల్ రుబా మూవీలో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిల్ రుబాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ ఇప్పటికే విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా కిరణ్ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్బంగా బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తమ సినిమాకు సంబంధించి ఎవరైనా కథ ముందుగా చెబితే వారికి తాను ఈ చిత్రంలో వాడిన బైక్ ను బహుమానంగా ఇస్తానంటూ ప్రకటించారు. తాజాగా కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Popular Oscar Awards 2025 :అంతటా ‘అనోరా’ ఏమిటా కథ