Dil Ruba : ‘క’ మూవీతో ఫుల్ మార్కులు కొట్టేసిన నటుడు కిరణ్ అబ్బవరం. తను నటించిన చిత్రం దిల్ రుబా(Dil Ruba). ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలతో వచ్చిన ఈ చిత్రం విచిత్రంగా బోల్తా పడింది. టేకింగ్, మేకింగ్ లో బాగానే ఉన్నా ఎందుకనో ఆకట్టుకోలేక పోయింది. దీనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు అబ్బవరం. తను ముందు నుంచి తన కథపై నమ్మకం పెట్టుకోవడం, అలాంటి వాటికే ప్రయారిటీ ఇవ్వడం చేస్తూ వచ్చాడు.
Dil Ruba Cinema Updates
కానీ సినిమా రంగమే అంత. ఒక్కోసారి ఒక్కో మూవీ బిగ్ సక్సెస్ అవుతుంది. ఇంకోసారి అనుకోకుండా బోర్లా పడుతుంది. తన సినీ కెరీర్ లో వచ్చిన మూవీ క . పేరు చిత్రంగా ఉన్నప్పటికీ ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా మందిని ఆలోచింప చేసేలా చేసింది. ఇదే ఊపుతో ఉన్న కిరణ్ అబ్బవరం దిల్ రుబా ప్రాజెక్టు ఎంచుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశాడు. కానీ ఆశించిన మేర ఆడలేదు. యూత్ నుంచి అంతగా స్పందన రాక పోవడం విస్తు పోయేలా చేసింది.
దీంతో విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకోలేక పోయింది. దీనిపై నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అబ్బవరం ఆ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయాడు. ఏది ఏమైనా సినిమాలో దమ్ముంటే ఎవరు అడ్డుకున్నా ఆగదు. ఆదరిస్తారు..అక్కున చేర్చుకుంటారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దిశగా ఆలోచించి తీసిన సినిమాలు బిగ్ సక్సెస్ అవుతున్నాయి. ఇందులో అనుమానం లేదు. తాజాగా విడుదలైన కోర్ట్ చిత్రమే ఇందుకు ఉదాహరణ. ఇకనైనా అబ్బవరం మంచి ప్రాజెక్టుతో ముందుకు వస్తాడని ఆశిద్దాం.
Also Read : Hero Aamir Khan :కిషోర్ కుమార్ బయోపిక్ లో అమీర్ ఖాన్