Kirak RP: జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ పెళ్ళి పీటలెక్కాడు. తన బ్యాచలర్ జీవితానికి వీడ్కోలు పలుకుతూ వివాహ బంధంలో అడుగు పెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్న మెడలో మూడుముళ్లు వేశారు. ఈ విషయాన్ని కిరాక్ ఆర్పీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
Kirak RP – గత ఏడాది ఘనంగా నిశ్చితార్ధం… ఈ ఏడాది రహస్యంగా పెళ్ళి
‘‘నేను విశాఖకు చెందిన లక్ష్మీప్రసన్న గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నాం. ఇరువర్గాల పెద్దల అంగీకారంతో గత ఏడాది నిశ్చితార్ధం చేసుకున్నాం. ఆ వేడుకకు వి.ఐ.పి.లు, సినీ సెలబ్రిటీలు వచ్చారు. కాని మా వివాహాన్ని మాత్రం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే గోప్యంగా ఉంచాం. నవంబరు 29న విశాఖలో ఓ హోటల్ మేము ప్రేమ వివాహం చేసుకున్నాం’’ అని కిరాక్ ఆర్పీ తెలిపారు.
తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న కిరాక్ ఆర్పీ
తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని గతంలో కిరాక్ ఆర్పీ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్ కు సివిల్స్ కోచింగ్ కు వచ్చిన లక్ష్మీ ప్రసన్నను మొదటిసారి చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయానని అన్నారు. ఆర్పీ లక్ష్మీ ప్రసన్నను ఫోన్ నెంబర్ అడిగితే… ఆమె తన తన తల్లి ఫోన్ నెంబర్‌ను ఇచ్చారట. మొదట లక్ష్మీ ప్రసన్న తల్లిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న ఆర్పీ… ఏడాది తర్వాత తన ప్రేమ విషయాన్ని లక్ష్మీ ప్రసన్న తల్లికే చెప్పి ఇరువర్గాలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
జబర్ధస్త్ ప్రోగ్రామ్ టూ నెల్లూరు చేపల పులుసు హోటల్ బిజినెస్
ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఈటీవిలో ప్రసారం అవుతున్న జబర్ధస్త్(Jabardasth) ప్రోగ్రామ్ తో కమెడీయిన్ గా అటు బుల్లితెరతో పాటు వెండితెరపై గుర్తింపు పొందారు కిరాక్ ఆర్పీ. ఆ తరువాత ‘వజ్ర కవచధర గోవింద’, ‘ఇదేం దెయ్యం’, ‘ఎంఎంఓఎఫ్’ తదితర చిత్రాల్లో నటించిన ఆర్పీ… ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో హోటల్స్ నడుపుతున్నారు.
Also Read : Salaar: ప్రభాస్ అభిమానులకు ‘సలార్’ నిర్మాత బంపర్ ఆఫర్