King Of Kotha : మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్తపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ కు వచ్చిన డబ్బులలో తనకు 1 శాతం వస్తే చాలన్నాడు సల్మాన్. ఆయన సినిమాను చూసిన వారిలో 10 శాతం మంది చూస్తే బయట పడతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
King Of Kotha Huge Hopes
ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు దుల్కర్ సల్మాన్. చిత్రానికి సంబంధించి మిశ్రమ స్పందన రావడం వల్ల ఓపెనింగ్స్ కొంత ఆశా జనకంగా లేనట్లు సమాచారం. ఇక కింగ్ ఆఫ్ కొత్త(King of Kotha) చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 40 కోట్లకు పైగా అమ్ముడు పోవడం ఒకింత మేలు చేసినా ఇంకా డబ్బులు రావాల్సి ఉందని నిర్మాతలు పేర్కొంటున్నారు.
రికవరీ అనూహ్యమైనదిగా కనిపిస్తోంది. కనీసం కింగ్ ఆఫ్ కొత్త చిత్రం హిట్ కొట్టాలంటే కనీసం వరల్డ్ వైడ్ గా రూ. 75 నుంచి 80 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు చేరుకుంటుందా అన్నది వేచి చూడాలని అంటున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.
ప్రధానంగా ఇప్పుడు చిత్రాలన్నీ కథ మీద ఆధారపడి నడుస్తున్నాయి. గతంలో హీరో, హీరోయిన్లను చూసి వెళ్లే వారు. కానీ సీన్ మారింది. స్టోరీ నచ్చితే ఎందాకైనా వెళ్లి చూస్తున్నారు.
Also Read : Pushpa-2 Movie : పుష్ప -2 మూవీ అప్ డేట్